కృష్ణానదిలో ఈతకు దిగిన ముగ్గురు విద్యార్థులు మృతి

విజయవాడ (CLiC2NEWS): కృష్ణానదిలో ఆదివారం ముగ్గురు విద్యార్థులు ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. 8వ తరగతి చదువుతున్న నడుపల్లి నాగసాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న గగన్ నీటిలో మునిగి పోయారు. అయితే వీరితో పాటు అక్కడకు వచ్చిన షారూక్ ఒడ్డునే ఉన్నాడు. అతని కళ్ల ముందే వారంతా మునిగిపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మృత దేహాలను వెలికితీశారు. మృతి చెందిన వారంతా విజయవాడ పడమటకు చెందినవారుగా గుర్తించారు.