స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

చిత్తూరు (CLiC2NEWS): జిల్లాలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. జిల్లాలోని రేణిగుంట మండలం జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో నలుగురు విద్యార్థులు ఈరోజు ఉదయం ఈతకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. వారిలో నికిత్ సాయి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. మిగిలిన వారి జాడ కనిపించలేదు. గల్లంతైన వారిలో గణేష్ (15), యుగంధర్(14), ధోని (16) ఉన్నారు.
రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.