ఈతకని వెళ్లి.. చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థలు మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని మల్కారం ఈదుళ్ల చెదువులో ఈత కోసం ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. వారిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా ఆరు, ఏడు తరగతులు చదువుతున్న విద్యార్థులే. పాఠశాల ముగిసిన అనంతరం సరదాగా ఈతకు వెళ్లారు. వీరిలో ముగ్గురికి ఈత రాకపోవడం వలన నీటిలో మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.