అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి

సిద్దిపేట (CLiC2NEWS): అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందినట్లు సమాచారం. సిద్దిపేటకు సమీపంలోని బక్రి చెప్యాలకు చెందిన రోహిత్‌కు టేకులపల్లికి చెందిన మాజి ఎంపిటిసి మోహన్‌రెడ్డి చిన్న కుమార్తె ప్రగతి రెడ్డికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు. వృత్తిరీత్యా వీరి కుటుంబం అమెరికాలో ఉంటుంది. రోహిత్ రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటు ఉంటున్నారు. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రోహిత్ భార్య ప్రగతి రెడ్డి, కుమారుడు అర్విన్ తల్లి సునీత అక్కడికక్కడే మృతి చెందారు. రోహిత్ రెడ్డి , తన చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుటుంబం అంతా కలిసి షాపింగ్ కు బయలుదేరిన సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. వెనుకనుంచి వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారును రోహిత్‌రెడ్డే నడుపుతున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రగతి రెడ్డి తల్లిదండ్రులు అమెరికాకు బయల్దేరినట్లు సమాచారం.