జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

పుల్వామా (CLiC2NEWS): జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా నాదిర్ గ్రామంలో గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. నాదిర్ గ్రామలంలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు వారిని మట్టుబెట్టాయి. ముందుగా వారికి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేయగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సైన్యం ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమిర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్‌లు మృతి చెందినట్లు సమాచారం. వీరిని లష్కరే తయ్యిబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు.