కర్నూలు గార్గేయపురం చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్ జెండర్ల మృతి
కర్నూలు (CLiC2NEWS): ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో చెరువు వద్ద మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద ఆదివారం వెలుగులోకి వచ్చింది. ముందుగా చెరువులో రెండు మృత దేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా మరో మృతదేహం చెరువు వడ్డున గుర్తించారు. చనిపోయిన వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. వేర్వేరు ప్రాంతాల నుండా ట్రాన్స్ జండర్లను తీసుకువచ్చి మృతదేమాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.