ఏలూరు జిల్లా వేగివాడ గ్రామంలో విషాదం..

భీమడోలు (CLiC2NEWS): ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలోని కోమటి గుంట చెరువులో మునిగి ముగ్గరు యువకులు మృతి చెందారు. మృతులు పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన అజయ్, అభిలాష్, సాగర్‌గా గుర్తించారు. భీమడోలు మండలంలోని పెదలింగంపాడులో బుధవారం వేడుకకు హాజరైన నలుగురు యువకులు తిరుగు ప్రయాణంలో కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆగ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.