Bapatla: రామాపురం సముద్ర తీరాన విషాదం..

వేటపాలెం (CLiC2NEWS): బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు స్నేహితులు సరదాగా గడిపేందుకు సముద్రతీరానికి వెళ్లారు. సముద్ర అలల తాకిడి తీవ్రం కావడంతో నలుగురు యువకులు గల్లంతయిన కాసేపటికే మూగ్గురు మృతదేహాలు ఒడ్డకు కొట్టుకొచ్చాయి. మరణించిన వారిలో నితిన్, అమలరాజ , కిషోర్‌గా గుర్తించారు. మరొకరి ఆచూకీ తెలియలేదు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.