తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఎటిఎంలను కొల్లగొట్టిన దుండగులు

హైదరాబాద్ (CLiC2NEWS): మంగళవారం తెల్లవారుజామున అటు ఎపిలో, తెలంగాణలో రెండు చోట్లు ఒకే సమయంలో ఎటిఎంలలో దుండగులు చోరీ చేశారు. జివిఎంసి 79 వార్డు పరిధి దేశపాత్రుని పాలెం గ్రామంలో గాజువాక-ఎలమంచిలి రోడ్డును ఆనుకొని ఉన్న ఎస్‌బిఐ ఎటిఎంలో రూ. 15,77,330 నగదును అపహరించారు. ఎటిఎం కేంద్రలోని 2 ఎసిలను , 6 సిసి కెమెరాలను గుర్తు పట్టలేని విధంగా కాల్చివేశారు.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 నుండి 3.30 గంటల మధ్యలో చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ (బి) కూడలి సమీపంలోని ఎటిఎంలో రూ.24,91,600 నగదును అపహరించారు దుండగులు. రెండు చోట్ల మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎటిఎంలను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి అందులని నగదుతో పారిపోయినట్లు తెలుస్తోంది. ఎటిఎం గదిలోని సిసి కెమెరాలపై తెల్లడి రంగును స్ప్రే చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.