Hyderabad: ఉరుములు.. మెరుపులతో కుండపోత వర్షం

హైదరాబాద్:(CLiC2NEWS) నగరంలో శనివారం కుండపోత వర్షం దంచి కొడుతోంది. నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, అమీర్పేట, ఎస్ఆర్నగర్, కూకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు సరూర్నగర్, కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్, రాంనగర్, బాగ్లింగంపల్లి, సికింద్రాబాద్, ముషిరాబాద్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, చంపాపేట, సైదాబాద్, చైతన్యపురి పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానపడింది.
హైదరాబాద్లో ఇవాళ (శనివారం) మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి కే జీహెచ్ఎంసీ సైతం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు సహాయం అందించేందుకు సైతం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. అత్యవసరమైతే 040 2111 1111 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపింది.