కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం..
బెబ్జూరులో ఆవుల మందపై దాడి
బెజ్జూరు (CLiC2NEWS): గత కొన్నిరోజులుగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. ఈ మధ్య కాలంలో బెజ్జూరు, పెంచికల్పేట శివారులో పెద్దపులి సంచరిస్తున్న దన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున లోడ్పల్లి బీట్ పరిధిలో ఆవుల మందపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఓ ఆవు మృతి చెందింది. ఈ విషయాన్ని స్థానికులు అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.
అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.