కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం..

బెజ్జూరు (CLiC2NEWS): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. జిల్లాలోని బెజ్జూరు మండలం గబ్బాయి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదన్న వార్తతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా గబ్బాయి అటవీ ప్రాంతంలో పులి దాడిలో ఒక ఆవు మృతి చెందింది. ఈ దాడిలో మరో రెండు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో పులిని గమనించిన పశువుల కాపర్లు చెట్టెక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
పెద్దపులి సంచారం విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు అందించారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పులి పాద ముద్రల ఆధారంగా అధికారులు పులి జాడను గాలిస్తున్నారు. పులి సంచరిస్తుండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.