భక్తులు చూసే విధంగా శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు..

తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు భక్తులు చూసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయంలోనో హుండీలను సమీపంలో ఉన్న నూతన పరకామణి భవనంలోకి తరలించారు. ఈ భవనంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గోప్రవేశం చేసిన అనంతరం కానుకల లెక్కింపు ప్రారంభించారు. ఈ భవనంలో ఒకేసారి రెండు వందల మంది సిబ్బంది కూర్చుని కానుకలు లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ లెక్కింపు ప్రక్రియను భక్తులు చూసే విధంగా పెద్ద పెద్ద అద్ధాలను అమర్చారు.