Tirumala: లోయలోకి దూసుకెళ్లిన పోలీసు వాహనం
తిరుమల (CLiC2NEWS): ఘాట్‌రోడ్‌లో ప్రమాదం జరిగింది. పోలీసు వాహనం బుధవారం మధ్యాహ్నం మొదటి ఘాట్‌రోడ్‌లోని లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంతో నలుగురు సిఆర్ ఎఫ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. జిఎంసి టోల్‌గేట్ దాటే క్రమంలో మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లటంతో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించారు.