తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. విచారణ చేపట్టిన సిట్

తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ వ్యవహారంపై దర్యాప్తుకు సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) శనివారం విచారణ చేపట్టింది. ముందుగా సిట్ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక నేతృత్వం వహిస్తున్న గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, తిరుపతి ఎఎస్‌పి వెంకట్రావు, డిఎస్‌పిలు సీతారామారావు, శివ నారాయణ స్వామి, సిఐలు సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరు మూడు రోజులపాటు తిరుపతిలో బస చేసి.. దర్యాప్తు కొనసాగించనున్నట్లు సమాచారం.