2024లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1,365 కోట్లు
తిరుమల (CLiC2NEWS): 2024వ సంవత్సరానికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ వివరాలు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2024వ సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వరుడి హుండీ ద్వారా రూ. 1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు టిటిడి వెల్లడించింది. గత సంవత్సరం 2.25 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుని దర్శంచుకున్నారు. వీరిలో 99 లక్షల మంది తమ తలనీలాలను సమర్పించారని టిటిడి వెల్లడించింది. అలాగే 6.30 కోట్ల మంది అన్నప్రసాదం తీసుకున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు 12.14 కోట్ల తిరుపతి లడ్డూలు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.