జూన్ 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల (CLiC2NEWS): ఈ నెల 24వ తేదీన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల ను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సెప్టెంబర్ నెలకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానికిక్ డిప్ ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్ల నమోదుకు టిటిడి అవకాశం కల్పించింది. అదే రోజు మరిన్ని టికెట్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.
జూన్ 21 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు
జూన్ 22 ఉదయం 11 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు
జూ్ న్ 22 ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు
జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు .. 24 వ తేదీన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.