ఈ నెల 18న ‘శ్రీవారి ఆర్జిత సేవ’ జులై కోటా టికెట్లు విడుదల

తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు .. జులై నెల కోటాను ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు టిటిడి ప్రకటనలో తెలిపింది. ఆర్జిత సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్లో టికెట్లు కేటాయింపు జరుగుతుంది. వీటిని పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్టాట్లకు టికెట్లు, 23 ఉదయం 10 గంటలకు అంగ ప్రదిక్షణం టోకెన్టు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్టు విడుదల. 23 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాదులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్టకోటాను విడుదల చేస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శన రూ. 300 టికెట్ల కోటా 24 ఉదయం 10 గంటలకు.. 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ కోటా, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు.. పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం బంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.