ఈ నెల 9న వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లు
తిరుమల (CLiC2NEWS): తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సామాన్య భక్తులకు అనుగుణం ఏర్పాట్లు జరుగుతున్నాయిని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ నెల 9 ఉదయం 5.30 గంటలకు కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వారసర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 91 కైంటర్ల ద్వారా టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
టిటిడి ఇఒతో టోకెన్ల జారీ ఏర్పాట్లపై చర్చించినట్లు బిఆర్ నాయుడు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని తెలిపారు. విఐపిలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. సామాన్య భక్తులకు అవకాశం కల్పించేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. సర్వదర్శన కౌంటర్లను ఆయన పరిశీలించినట్లు వెల్లడించారు.