భీమ్లానాయక్ టైటిల్ సాంగ్.. పుల్ వీడియో సాంగ్ రిలీజ్
హైదరాబాద్ (CLi2NEWS): పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లానాయక్’. ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘భీమ్ భీమ్ భీమ్లానాయక్’.. అంటూ సాగే ఈ పవర్‌పుల్ పాటకు పవన్ కల్యాణ్‌తో పాటు సునీల్, సప్తగిరి, ఆది స్టెప్పులేశారు. రామజోగయ్య శాస్త్రి రచించిన పాటకు రామ్ మిర్యాల, పృథ్వీ చంద్ర ఆలపించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించారు.