జలమండలి ఎండీ దానకిశోర్‌కు టీజీవోల కృతజ్ఞతలు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ హెల్త్‌కార్డులు అందించినందుకు గానూ టీజీవో హైదరాబాద్ జిల్లా నాయకులు జలమండలి ఎండీ దానకిశోర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో దానకిశోర్‌ను కలిసి సన్మానించారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయన చూపించిన చొరవ పట్ల హర్షం వ్యక్తం చేశారు. హెల్త్‌కార్డుల ద్వారా కష్టసమయంలో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఒక భరోసా ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్, కార్యదర్శి హరికృష్ణ, కోశాధికారి ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.