గూడులేని వారికి గుడ్‌న్యూస్.. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షలు!

హైదరాబాద్ (CLiC2NEWS): 2023-24 తెలంగాణ బడ్జెట్‌లో కెసిఆర్ సర్కార్ ఇల్లులేని వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సర్కార్ నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు బడ్జెట్ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కోట్లతో ప్రతిపాదించారు. ప్రగతీశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తోంది అంటూ మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.
సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ. 3లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. దీనకి కోసం రూ. 7,890 కోట్లను సర్కార్ కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. సొంత స్థలం లో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మందికి రూ. 3లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే సిఎం కోటాలో 25 వేల మందికి రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
తప్పకచదవండి:telangana budget: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కోట్లు
Telangana Budget: వ్యవసాయ రంగానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు