వరుసగా నాలుగో రోజు తగ్గిన పసిడి ధర
హైదరాబాద్ (CLiC2NEWS): బంగారం ధర క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా నాలుగో రోజు పసిడి ధర తగ్గింది. ఢిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన 99.9 బంగారం ధర రూ. 700 తగ్గి.. రు.77,050 కి చేరింది. ఇంతకు ముందు రూ 77,750 ఉండగా… తాజాగా రూ.700 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ స్తబ్దుగా ఉండటం దీనికి కారణ మని అంచానా వేస్తున్నారు. అదే విధంగా వెండి కూడా భారీగాతగ్గింది. వెండి కిలో రధర రూ. 2,310 తగ్గి రూ.90,190 వద్దకు చేరింది.