నేడు తెలంగాణ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన రోజు: కెటిఆర్ ట్వీట్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ‘మీ పోరాటం అనిత‌ర సాధ్యం. ఒక న‌వ‌శ‌కానికి నాంది ప‌లికిన రోజు. ఒక బ‌క్క‌ప‌లుచ‌ని వీర‌డు బందూకై త‌న జాతిని మేలు కొలిపిన రోజు’ అంటూ.. 2009, న‌వంబ‌ర్ 29 తెలంగాణ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ రోజ‌ని ట్వీట్ చేశారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ 13 ఏళ్ల క్రితం న‌వంబ‌ర్ 29న‌ తెలంగాణ వ‌చ్చుడో.. కెసిఆర్ చ‌చ్చుడో అనే నినాదంతో ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆనాటి రోజుల‌ను మంత్రి కెటిఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ చ‌రిత్ర‌లో ఈ రోజు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌దిగా.. దీక్షా దివ‌స్ అని ట్వీట్ చేశారు.

యావ‌త్ భార‌త్‌దేశం తెలంగాణ‌వైపు చూసే విధంగా, చరిత్ర‌ను మ‌లుపు తిప్పిన రోజు..ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు అంకురార్ప‌ణ చేసిన రోజును దీక్షా దివ‌స్‌గా పాటిస్తున్న‌ది.

Leave A Reply

Your email address will not be published.