ఇవాళ అత్యంత భారీ వ‌ర్షం:వాతావ‌ణ శాఖ‌

రానున్న రెండు రోజులు అతి భారీ వ‌ర్షాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ద‌క్షిణ,ఒడిశా-ఉత్త‌రాంధ్ర ప‌రిసర ప్రాంతాల్లో ఉన్న అప్ప‌పీడ‌నం ఇవాళ (మంగ‌ళ‌వారం) తీవ్ర అల్ప పీడ‌నంగా బ‌ల‌ప‌డిందని హైద‌రాబాద్ వాతార‌ణ కేంద్ర వెల్ల‌డించింది. ఈ అల్ప‌పీడ‌నం ఓడివా తీర ప్రాంతాల్లో కేంద్రీకృమై ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికార‌లు తెలిపారు. దీనికి అనుంబంధంగా ఏర్ప‌డిన ఉప‌రిత ఆవ‌ర్త‌నం స‌గ‌టు స‌ముద్ర మ‌ట్టానికి 7.6 కిలోమీట‌ర్ల మేర వ‌ర‌కు విస్త‌రించి ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఇవాళ అత్యంత భారీ వ‌ర్షం కురువ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అలాగే రానున్న రెండు రోజులు అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాష్ట్రంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ కేంద్రం సూచించింది.

Leave A Reply

Your email address will not be published.