AP: నేడు, రేపు తేలికపాటి వర్షాలు

విశాఖపట్నం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. అక్టోబరు 26వ తేదీన ఈశాన్య రుతుపవనాల రాక మొదలవుతుంది.
అలాగే అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ ఏపీ వైపు వీస్తోంది.
దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది.