Tokyo Paralympics: కృష్ణ నాగర్‌కు స్వర్ణం

టోక్యో (CLiC2NEWS): టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఆదివారం పతకాల పంట పడింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ హెచ్6 ఫైనల్స్‌లో భారత్ ఆటగాడు కృష్ణ నాగర్ బంగార పతకాన్ని కొల్లగొట్టాడు.
దీంతో ఈ క్రీడల్లో భారత్ ఖాతాలో 5 స్వర్ణాల వచ్చి చేరాయి.
ఫైనల్లో హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన మ్యాచ్‌లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్‌ఎల్ 3 విభాగంలో ప్రమోద్ భగత్ గోల్డ్ సాధించిన విషయం తెలిసిందే.
పారొలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 19 చేరింది. వీటిలో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.