తెలంగాణలో రేపు టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): జులై 7న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వుడదల చేయనున్నట్లు పరీక్షల విభాగం డైరెర్టర్ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. జూన్ 14వ తేదీ నుండి 22 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసినదే. విద్యార్థులు ఫలితాలను www.bse.telangana.gov.in, results.bsetelangana.org వెబ్‌సైట్‌లలో చూడగలరు.