ఇంద్రకీలాద్రి: రేపు, ఎల్లుండి విఐపి దర్శనాలు రద్దు

విజయవాడ (CLiC2NEWS): విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రికి భ‌వానీ భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తుండ‌టంతో అక్క‌డి క్యూలైన్లు ర‌ద్దీగా మారాయి. భ‌వానీ భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా రేపు, ఎల్లుండి ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్‌ దర్శనాలను రద్దు చేశారు.

ఈ నిర్ణ‌యంతో రేపు, ఎల్లుండి సాధారణ దర్శనాలను మాత్రమే అనుమతిస్తామని కలెక్టర్‌ తెలిపారు. భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతి నిరాక‌రిస్తున్నారు. మ‌రోవైపు క‌న‌క‌దుర్గ‌మ్మ రాజ‌రాజేశ్వ‌రి అలంకారంతో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.