తెలుగు రాష్ట్రాలలో రేపు, ఎల్లుండి వర్షాలు!

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళ ఖాతంలో అండమాన్ దీవులకు దక్షిణంగా ఈ నెల 29వ తేదీన అల్లపీడనం ఏర్పడే అవకాశమున్నందున, అది బలపడి పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే అవకాశమున్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో శని, ఆదివారాలల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో శనివారం భారీ వర్షాలు, అది, సోమవారాల్లో అతి భారీ వర్షాలు కురిసూ అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.