రూ.4ల‌క్ష‌ల లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన టౌన్ ప్లానింగ్‌ అధికారిణి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ అధికారులకు చిక్కారు. రూ. 4 ల‌క్ష‌ల లంచం తీసుకుంటూ నార్సింగి మున్సిప‌ల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మ‌ణిహారిక ఎసిబికి ప‌ట్టుబ‌డ్డారు. మంచిరేవుల‌లో ప్లాట్ ఎల్ ఆర్ ఎస్ క్లియ‌ర్ చేసేందుకు మ‌ణిహారిక రూ.10 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రూ.4ల‌క్ష‌లు తీసుకుంటుండ‌గా ఎసిబి అధికారులు ప‌ట్టుకున్నారు. మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఎసిబి డిఎస్‌పి శ్రీ‌ధ‌ర్ ఆధ్వర్యంలో సోదాలు జ‌రుగుతున్నాయి.

 

భార‌త 17వ ఉప రాష్ట్రప‌తిగా సిపి రాధాకృష్ణ‌న్

Leave A Reply

Your email address will not be published.