రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో రేపు (సోమవారం) టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ప్లీనరీ మీటింగ్‌కు తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతుండటంతో హైటెక్స్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
ఈ మేరకు నగర వాసులకు పలు సూచనలు చేశారు.
- నీరూస్, సైబర్ టవర్, మెటల్ చార్మినార్, గూగుల్(సీఐఐ), కొత్తగూడ జంక్షన్ రోడ్లు
- మెటల్ చార్మినార్, ఖానామెట్, హైటెక్స్/హెచ్‌ఐసీసీ/ఎన్‌ఏటీ జంక్షన్లు, రోడ్లు
- జేఎన్టీయూ, సైబర్ టవర్స్, బయో డైవర్శిటీ జంక్షన్లు
- గచ్చిబౌలి, బొటానికల్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్లు
- నీరూస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు రూట్‌లో వెళ్లే వారు సీఓడీ (అయ్యప్ప సొసైటీ, మాదాపూర్) నుంచి దుర్గం చెరువు, ఇన్ ఆర్బిట్ మాల్, ఐటీసీ కొహినూర్, ఐకియా, బయో డైవర్శిటీ, గచ్చిబౌలి, సైబర్ టవర్ జంక్షన్ వైపు
- మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్ నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు రోలింగ్ హిల్స్ ఏఐజీ దవాఖాన, ఐకియా, ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు రోడ్డులోకి వెళ్లాలి. సైబర్ టవర్ జంక్షన్‌కు వెళ్లొద్దని చెప్పారు. ఇక ఆర్సీపురం, చందానగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వెళ్లేవారు, బీహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ఐఐఐటీ గచ్చిబౌలి రూట్లలో వెళ్లాలని, మిగతా రూట్లలో వెళ్లొద్దని చెప్పారు.