గణేష్ నిమజ్జనం.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/GANESH-NIMAJJANAM.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో రేపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. హుస్సేన్ సాగర్‌లో 15వేల నుండి దాదాపు 20వేల వరకు విగ్రహాలు నిమజ్జనమవుతాయని, 3వేల మంది ట్రాఫిక్ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర సజావుగా కొనాసాగేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనానికి చూడడానికి వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింక్ ప్రదేశాలను ఏర్పటు చేశారు. ఇతర వాహనాల ప్రయాణాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు సమాచారం. ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.