కుప్ప‌కూలి.. భ‌గ్గుమ‌న్న విమానం

ఘోర విషాదం: ప్ర‌మాదంలో 121 మంది ప్ర‌యాణికులు మృతి

అహ్మ‌దాబాద్ (CLiC2NEWS): అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ గురువారం బ‌య‌లుదేరిన విమానం ఘోర ప్ర‌మాద‌నికి గురైంది. ఈ ప్ర‌మాద సమయంలో ఎఐ 171 విమానంలో ప్ర‌యాణించిన ప్ర‌యాణికుల్లో 241 మంది మృతి చెందిన‌ట్లు విమాన‌యాన సంస్థ ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌మాదంలో కేవ‌లం ఒక‌రు మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. మృతుల్లో 229 మంది ప్ర‌యాణికులు కాగా, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భార‌తీయులు, 53 మంది బ్రిట‌న్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు, కెనడాకు చెందిన వారు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు విమానయాన సంస్థ ప్ర‌క‌టించింది.
కాగా ఈ ప్ర‌మాదంలో గుజ‌రాత్ మాజీ సిఎం విజ‌య్ రూపానీ కూడా దుర్మ‌ర‌ణం చెందారు. కాగా ఈ విమానం భ‌వ‌నాల‌పై కూల‌డంతో అక్క‌డ కూడా మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

Leave A Reply

Your email address will not be published.