మెరీనా బీచ్‌లో విషాదం.. నలుగురి మృతి

చెన్నై (CLiC2NEWS): చెన్నై మెరీనా బీచ్‌లో భారత వైమానికి దళం (IAF) ఆదివారం మెగా ఎయిర్ షో నిర్వహించారు. ఈ షోను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు తరలివచ్చారు. షో అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో రద్దీ ఎక్కువై ప్రజలు నానా ఇబ్బుందులు ఎదుర్కొన్నారు. దీంతో పాటు ఎండవేడి, ఉక్కపోత తాళలేక ముగ్గురు సొమ్మసిల్లీ ప్రాణాలు కోల్పోయారు మరొకరు గుండెపోటుకు గురై మృత చెందారు. ఇంకా దాదాపు 203 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారందరినీ చెన్నై లోని 3 ఆస్పత్రులకు తరలించారు.
బీచ్‌లో జరిగే ప్రదర్శనకు చెన్నై నుండే కాక.. పరిసర ప్రాంతాల నుండి కూడా జనం భారీగా తరలివచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో అన్ని రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్లాట్‌ఫాంలపై నిలబడేందుక కూడా వీల్లేకుండా నిండిపోయారు.