పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి.. చావుబతుకుల్లో తల్లి
మెదక్ (CLiC2NEWS): దీపావళి పండగపూట మెదక్ పట్టణంలోని ఆటోనగర్‌లో పండగపూట విషాదం చోటుచేసుకుంది. స్కూటీపై ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తున్న మహిళను టిప్పర్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కవలలు పృథ్వీ తేజ్ (12), ప్రణస్త్రఈత్ తేజ్ (12) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన తల్లి అన్నపూర్ణస్థానిక ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. పండుగ సందర్భంగా బాణా సంచా కొనడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా అన్నపూర్ణ భర్త రెండు సంవత్సరాల కిందట ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.