వరంగల్ జిల్లా ఇల్లందలో విషాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/Road-accident-at-WARANGAL-KHAMMAM-HIWAY.jpg)
వర్దన్నపేట (CLiC2NEWS): ఒకే బైక్పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై నలుగురు ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా లోని వర్దన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు.. 17 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు మృత్యువాతపడ్డారు. వర్దన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్దు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్లు ఒకే బైక్పై ప్రయాణిస్తున్నారు. వీరు ఇల్లంద నుండి వర్దన్నపేట వైపు వెళ్తండగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ బస్సు ఎన్నికల సభకు ప్రజలను తరలించి తిరిగి ఖాళీగా వస్తుంది.
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఉత్తార్ణులైన సందర్బంగా విందు చేసుకొని.. ఒకే బైక్పై తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. రెండు వాహనాలు వేగంగా రావడంతో బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగానే నలుగరు విద్యార్థులు సుమారు 50 మీటర్ల దూరంలో చెల్లచెదురుగా ఎగిరి పడినట్టు సమాచారం.. ఇల్లంద గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.