విరాటపర్వం ట్రైలర్ రిలీజ్..
హైదరాబాద్ (CLiC2NEWS): రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. నక్సలిజం నేపథ్యంలో సాగే ప్రేమకథగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదలైంది. జూన్ 17వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. కార్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్ను విడుదల చేశారు.
చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు .. అంటూ రానా చెప్పిన డైలాగులతో ట్రైలర్ మొదలవుతుంది. ఈచిత్రాన్ని 1990ల్లో జరిగిన యదార్ధ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించినట్టు చిత్ర వర్గం వెల్లడించింది. ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించనున్నాడు. వెన్నెలగా సాయిపల్లవి నటించింది.
