బెంగాల్లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఆరుబోగీలు
Train accident in Bengal

పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బికనీర్ – గౌహతి ఎక్స్ప్రెస్ లోని కొన్నిబోగీలు పట్టాలు తప్పాయి. ఈప్రమాదంలో పలువురు ప్రయాణికులు బోగీల్లోనే చిక్కుకుపోయారు. ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. గాయలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.