పట్టాలు తప్పిన రైలు.. నలుగురు మృతి , పలువురికి గాయాలు

లఖ్నవూ (CLiC2NEWS): ఉత్తర్ ప్రదేశ్లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. 12 రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గురువారం చండీగఢ్ , దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలులోని 4 ఎసి కోచ్లు సహా మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం.