Vijayanagaram: రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి

విజయనగరం (CLiC2NEWS): జిల్లాలోని కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి. సిగ్నల్ లేకపోవడంతో విశాఖ నుండి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో వెనుక నుండి వచ్చే విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఆప్రాంతమంతా చీకటి అలుముకుంది. సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుంది. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
[…] […]