మునుగోడు టిఆర్ ఎస్ అభ్యర్థి ఖరారు
కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మునుగోడు బై పోల్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంటల్ల ప్రభాకరరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. మునుగోడు అభ్యర్థి ఎంపిక కోసం సుదీర్ఘ చర్చల అనంతరం టిఆర్ ఎస్ అధిష్టానం కూసుకుంట్ల వైపు మొగ్గు చూపింది. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలిచారు. 2018 ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ చేతిలో ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.