టిఆర్ఎస్ ఇక నుండి బిఆర్ఎస్.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం

హైదరాబాద్ (CLiC2NEWS): టిఆర్ ఎస్ ఇక నుండి బిఆర్ ఎస్‌గా మారనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్)ను బిఆర్ ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇసి నుండి అధికారికంగా లేఖ అందినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన కెసిఆర్ టిఆర్ ఎస్ పార్టీని బిఆర్ ఎస్‌గా మారుస్తూ కొత్త జాతీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ సందర్భంగా ఈ నెల 9వ తేదీన తెలంగాణ భవన్‌లో బిఆర్ ఎస్ ఆవిర్భావ కార్యక్రమం, జెండా ఆవిష్కరణ నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్ర మంలో పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
I may need your help. I tried many ways but couldn’t solve it, but after reading your article, I think you have a way to help me. I’m looking forward for your reply. Thanks.