ముగిసిన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం..

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యక్షతన జరిగిన టిఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంకు టిఆర్ ఎస్ ఎంపీలు హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాన్ని గురించి సిఎం కెసిఆర్ ఎంపిలతో చర్చించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై , కేంద్రం నుండి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై చర్చలు జరిపారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం 23 అంశాలతో కూడిన నివేదిక రూపొందించింది. ఈనివేదికను సిఎం ఎంపీలకు అందజేశారు.