నేడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రగతి భవన్లో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు జరగే ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కానున్నారు. నవంబరు 29వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానం గురించి సిఎం చర్చించనున్నారు. తెలంగాణ లోని వరిధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం అవలంభిస్తున్న తీరుతెన్నులు గురించి ముఖ్యంగా చర్చించనున్నారు.