టిఆర్ఎస్ విజయగర్జన మరోసారి వాయిదా..
అమల్లోకి ఎన్నిక కోడ్..!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి (మంగళవారం) నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి బహిరంగసభలు, మీటింగ్‌లు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. డిసెంబరు 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని శశాంక్ తెలిపారు.
కాగా ఎన్నికల కోడ్ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టిఆర్ఎస్ విజయగర్జన సభ మరోసారి వాయిదా పడింది.