UP: ట్రాక్ట‌ర్ ట్రాలీని ఢీకొన్న ట్ర‌క్కు.. 8 మంది దుర్మ‌ర‌ణం

బులంద్‌ర‌ష‌హ‌ర్ (CLiC2NEWS): ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. సోమ‌వారం తెల్ల‌వారు జామాన జ‌రిగిన ఈ రోడ్డు ప్ర‌మాదంలో 8 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో 43 మంది తీవ్ర గాయాల‌పాల‌య్యార‌ని పోలీసులు తెలిపారు.

ప్ర‌మాదంపై.. సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు..
బులంద్ ష‌హ‌ర్-అలీగ‌ఢ్ స‌రిహ‌ద్దులో ఆర్నియా బైపాస్ స‌మీపంలో ట్రాక్ట‌ర్ ట్రాలీని క్వాంట‌ర్ ట్ర‌క్కు వెనుక నుంచి బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ట్రాక్ట‌ర్ ట్రాలీ బోల్తా ప‌డ‌ప‌డింద‌ని పోలీసులు తెలిపారు.

ఘ‌ట‌నా స‌మ‌యంలో ట్రాక్ట‌ర్ ట్రాలీలో 61 మంది ఉన్నారు. వీరంతా కాస్గంజ్ జిల్లాలోని ర‌ఫ‌త్పూర్ నుండి రాజ‌స్థాన్‌లోని జ‌హ‌ర్పీర్ కు తీర్థ‌యాత్ర‌లో భాగంగా ప్ర‌యాణిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు.

ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 8 మంది ఘ‌ట‌నాస్థ‌లంలోనే మ‌ర‌ణించారు. మ‌రో 43 మంది తీవ్ర గాయాల‌పాల‌య్యారు. వారిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. 10 మంది ప్ర‌యాణికులు మాత్రం స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిలో 12 మంది 18 యేళ్ల లోపు వ‌య‌సుగ‌ల‌వారు.

మృతుల వివ‌రాలు:

ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ ఇయు బాబు (40), రాంబేటి (65), చాందిని (12), ఘ‌నిరామ్ (40), మోక్షి (40), శివాంష్ (6), యోగేష్ (50), వినోద్ (45) వీరంతా కాస్లంగ్ జిల్లా వాసుల‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్ర‌మాదంపై యుపి సిఎం యోగీ ఆదిత్య‌నాథ్ స్పందించారు. యాత్రికుల మృతికి తీవ్ర సంతాపం ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియో ప్ర‌క‌టించారు. అలాగే గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేల చొప్పున ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: రాష్ట్రంలోని గ‌ణేశ్ మండ‌పాల‌కు ఫ్రీ క‌రెంట్

Leave A Reply

Your email address will not be published.