TS: టిఆర్ఎస్ ఎంపి నామా ఇంట్లో ఈడీ సోదాలు…
హైదరాబాద్ (CLiC2NEWS): టిఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు నామాకు చెందిన మధుకాన్ గ్రూప్ సంస్థలు సహా ఐదు చోట్ల కొనసాగుతున్నాయి.
మధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని రూ. వెయ్యి కోట్లకు మోసం చేసినట్లు వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నామాతో పాటుగా రాంచి ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీతేజ ఇళ్లపై కూడా ఈడీ దాడులు చేసింది. 2019లో నామాపై సీబిఐ కేసు నమోదు చేసిన విషయంతెలిసిందే.
కాగా ఆయా సంస్థల అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశముంది.