TS: తెలంగాణలో భారీగా డిఇఒల బదిలీలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పలువురు డిఇఒలను బదిలీలు చేస్తూ రాష్ట్ర సర్కార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం డిఇఒగా ఎస్.యాదయ్య నియామకం కాగా భద్రాద్రి కొత్తగూడెం డిఇఒగా పి.అనురాధరెడ్డి, ఎస్సీఈఆర్టీ ఉప సంచాలకురాలిగా చైతన్య జైనీ, ఆమెకే యాదాద్రి భువనగిరి డిఇఒగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్గా ఎస్.ఎస్.సూర్యప్రసాద్, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి డిఇఒగా సూర్యప్రసాద్కు అదనపు బాధ్యతలు.
సంగారెడ్డి డిఇఒగా నాంపల్లి రాజేశ్, కరీంనగర్ డిఇఒగా సీహెచ్.వి.ఎస్.జనార్దన్రావు, రంగారెడ్డి డిఇఒగా పి.సుశీంద్రరావు, నారాయణపేట డిఇఒగా లియాఖత్ అలీ, వనపర్తి డిఇఒగా ఎ.రవీందర్, జోగులాంబ గద్వాల డిఇఒగా మహ్మద్ సిరాజుద్దీన్, జనగాం డిఇఒగా టి.రాముకు అదనపు బాధ్యలను అప్పగిస్తూ ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.