TS: పాఠ‌శాల‌ల‌కు వేసవి సెలవులు పొడిగింపు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని స్కూళ్ల‌కు వేసవి సెలవులను పొడిగిస్తూ స‌ర్కార్ మంగళవారం నిర్ణయం వెలువరించింది. జూన్‌ 15వ తేదీతో స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. కాగా వేసవి సెలవులను పొడిగిస్తూ స‌ర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు అన్ని పాఠ‌శాల‌లు, డైట్‌ కాలేజీలకు జూన్‌ 20వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ ఈ నెల 20 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్న‌ది. సాయంత్రం 6 గంట‌ల నుండి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్ డౌన్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్న విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.